1984 సిక్కు అల్లర్ల కేసులో : కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

1984 సిక్కు అల్లర్ల  కేసులో : కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను దోషిగా తెలుస్తూ ఫిబ్రవరి 12న ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ కేసులో సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది స్పెషల్ కోర్టు. మంగళ వారం ( ఫిబ్రవరి 25, 2025 ) ఈమేరకు తీర్పు వెల్లడించింది కోర్టు.1984 నవంబర్ లో ఢిల్లీలోని సరస్వతి విహార్ లో తండ్రీకొడుకుల హత్య కేసులో సజ్జన్ కుమార్ దోషిగా నిర్ధారించబడ్డాడు. కుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు.

40 సంవత్సరాల క్రితం వాయువ్య ఢిల్లీలోని సరస్వతి విహార్ లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో తండ్రి, కొడుకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుమార్ ను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. కుమార్ ఇప్పటికే మరో అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత: 

ప్రాసిక్యూషన్​ ప్రకారం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద సమూహం మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, ఆస్తుల ధ్వంసం, ఇండ్ల దహనాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే సరస్వతి విహార్‌‌‌‌ ప్రాంతంలో ఓ అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌‌‌‌ను హతమార్చినట్టు జస్వంత్​ భార్య కంప్లయింట్​ చేసింది. అయితే..  సజ్జన్ కుమార్ ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా ఆ గుంపుకు నాయకత్వం వహించాడని కోర్టు పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.