కృష్ణజింకల కేసు: బదిలీ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

కృష్ణజింకల కేసు: బదిలీ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు రాజస్థాన్ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. 1998 కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ బదిలీ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు అనుమతించింది. నటుడికి సంబంధించిన పిటిషన్లు ఇప్పుడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. రాజస్థాన్ లోని జోథ్ పూర్ అటవీప్రాంతంలో 1998లో రెండు కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ వేటాడటంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. 

1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ జోథ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలపై కాల్పులు జరిపారు. కృష్ణజింకలను వేటాడిన సమయంలో సల్మాన్‌తో పాటు పలువురు హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, నీలమ్‌, టబు కూడా సల్మాన్ వెంట ఉన్నారు. సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేయగా ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది.

ఇవి కూడా చదవండి:

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం