19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

కొడంగల్​, వెలుగు:  భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్​లో జరిగింది. 19 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను బుధవారం పోలీసులు, అగ్రికల్చర్​అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సమాచారం మేరకు దౌల్తాబాద్​మండలం కుదురుమల్లకు చెందిన కమ్మరి వెంకటేశ్​ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.

దాదాపు 41 బస్తాల్లో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి సీజ్ చేసినట్టు దౌల్తాబాద్​ఎస్ఐ శ్రీశైలం యాదవ్​తెలిపారు. నిందితుడు వెంకటేశ్​పై కేసు నమోదు చేసిన అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సోదాల్లో ఏవో లావణ్య, ఏఎస్​ఐ ముత్తా రాజ్​, ఏఈవో హారిక పాల్గొన్నారు.