మలేరియా..ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది పరాన్న జీవి అయిన ప్లాస్మోడియా ప్రోటోజోవాన్ల వల్ల సోకుతుంది. మలేరియాలో వస్తే చలి జ్వరం, తలనొప్పి, మూర్చ, శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు మలేరియా నివారణకు రెండు రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. అయితే ఇవి మలేరియా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి.. తాజాగా క్లినికల్ మలేరియాపై ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. అదే RH5.1/Matrix-M అనే వ్యాక్సిన్..
GlobalData నివేదిక ప్రకారం.. RH5.1/Matrix-M అనే వ్యాక్సిన్.. మలేరియాను సమర్థవంతంగా నివారిస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం ఫేజ్ 2 డెవలప్ మెంట్ లో మరో 11 మలేరియా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో, UK పరిశోధకులు ఇటీవలి అధ్యయనం ప్రకారం..RH5.1/Matrix-M సురక్షితమైనది, సమర్థవంతమైనది, అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.
ప్రస్తుతం రెండు మలేరియా వ్యాక్సిన్‌లు మాత్రమే ఉన్నాయి. అవి WHO ఆమోదం పొందినవి. పిల్లలకు కూడా వినియోగించేందుకు సిఫారసు చేయబడినవి.. GSK తయారు చేసిన మోస్క్విరిక్స్ , సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన R21/మ్యాట్రిక్స్-M.
ఈ టీకాలు పరాన్నజీవి ప్రారంభ స్పోరోజోయిట్ దశను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మలేరియా సంక్రమణను అడ్డుకునేందుకు పని చేస్తాయి. అయినప్పటికీ రోగనిరోధక శక్తి కాలక్రమేణా క్షీణించడంతో, స్పోరోజోయిట్లు కాలేయానికి సోకవచ్చు, రక్త-దశ క్లినికల్ మలేరియా సంక్రమణకు దారితీస్తాయి.
RH5.1/Matrix-M మొదటి రక్త-దశ మలేరియా వ్యాక్సిన్లతో మొట్టమొదటిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మలేరియా వ్యాక్సిన్‌లకు కంటే బెస్ట్ వన్. రెండో దశ మలేరియా స్టేజ్ లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అని గ్లోబల్‌డేటాలోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనలిస్ట్ స్టెఫానీ కుర్డాచ్ చెబుతున్నారు.