దేశంలో కొత్త రోగం.. ఒకరు ఇప్పటికే చచ్చిపోయారు.. 18 మంది ఐసీయూ.. మరో 101 మంది ఎటాక్..

దేశంలో కొత్త రోగం.. ఒకరు ఇప్పటికే చచ్చిపోయారు.. 18 మంది ఐసీయూ.. మరో 101 మంది ఎటాక్..

దేశంలో ఉన్న సమస్యలు.. జనానికి ఉన్న రోగాలు తక్కువ అయినట్లు.. కొత్త రోగం వచ్చి చచ్చింది. ఈ బ్యాక్టీరియా ఏమన్నా అల్లాటప్పానా అనుకుంటే తప్పులే కాలేసినట్లే.. ఇప్పటికే ఒకరి ప్రాణాలు తీసింది.. మరో 101మందికి ఇప్పటికే ఎటాక్ అయ్యింది. 18 మంది ఐసీయూలో ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్రం పూణె, షోలాపూర్ లో విజృంభిస్తున్న ఈ రోగం పేరు గులియన్ బారే సిండ్రోమ్.. GBS అని పిలుస్తున్నారు. ఈ రోగం వచ్చిన వారిలో డయేరియా లక్షణాలతోపాటు దగ్గు, జలుబు ఉంటుంది.. గులియన్ బారే సిండ్రోమ్  వల్ల ఇప్పుడు పూణెలో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఎంటీ వైరస్.. లక్షణాలు ఏంటీ.. ఇతరులకు సోకుతుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ అనేది తెలుసుకుందాం..

ఒకరు మృతి

మహారాష్ట్రలోని సోలాపూర్ లో అనారోగ్యంతో ఒకరు మృతి చెందారు. జనవరి 18న ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో  చేరిన బాధితుడు  శ్వాస తీసుకోవడంలో  మరింత  ఇబ్బంది తలెత్తి  చనిపోయాడు.   ఇతను   గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కారణంగా చనిపోయిన  మొదటి  మరణంగా డాక్టర్లు నివేధించారు. బాధితుడు డయేరియాతో బాధపడుతున్నాడని.. దగ్గు మరియు జలుబు లక్షణాలు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

 జీబీఎస్ అనేది నరాల బలహీనతకు సంబంధించిన అనారోగ్యంగా గుర్తించారు. ఇది తలెత్తిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ నరాలపై పడుతోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 28 పెరిగింది, పూణేలో మొత్తం GBS కేసుల సంఖ్య 101కి చేరుకుంది. 18 మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.  9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 19 మంది పిల్లలలో ఈ బాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. 50- 80 ఏళ్ల వయస్సున్న వారిలో 23 కేసులు నమోదయ్యాయి.

వ్యాధి విజృంభిస్తుండటంతో  అధికారులు నీటి పరీక్షలను ముమ్మరం చేశారు. అయితే ఎక్కువ కేసులు నమోదైన పూణేలో ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని బావిలో ఇ.కోలి బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది.

Also Read :- ఊపిరిపీల్చిన కాలిఫోర్నియా..

Guillain-Barre Syndrome (GBS) అంటే ఏమిటి?

  • GBS అనేది బ్యాక్టీరియా రోగనిరోధక  వ్యవస్థ నరాలపై దాడి చేసే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారు  నరాల బలహీనత, పక్షవాతం వంటి సమస్యలు ఉంటాయి. 
  • అయితే  బాధిత రోగులలో 80 శాతం మంది డిశ్చార్జ్ అయిన ఆరు నెలలలోపు స్వతంత్రంగా నడిచే సామర్థ్యాన్ని తిరిగి పొందుతారని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ, కొంతమంది రోగులు పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
  • GBS చికిత్స చాలా ఖర్చుతో కూడుకుంది.  రోగులకు ఇమ్యునోగ్లోబులిన్ (IVIG) ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ ఇంజెక్షన్  ఒక్కోదానికి సుమారు రూ. 20,000 వరకు ఉంటుంది. 
  •  మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రభుత్వ ఆసుపత్రులలో GBS చికిత్సను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు.

గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు : 

  • శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
  •  ఒళ్లంతా నెప్పులు.. కండరాల నొప్పులతో బలం తగ్గిపోతుంది.
  • నరాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది.. నరాల నొప్పులు, బలహీనం కావటం చేస్తుంది.
  •  జలుబు, దగ్గుతోపాటు వాంతులు, విరోచనాల లక్షణాలు కూడా కనిపిస్తాయి. 
  • కొందరిలో డయేరియా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు.
  •  పిల్లలు, వృద్ధులకు త్వరగా ఎటాక్ అయ్యే అవకాశం ఉంది.
  •