- నాసిక్ ఆర్టిలరీ సెంటర్ లో ఘటన
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఆర్టిలరీ సెంటర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు అగ్నివీర్ లు మృతి చెందారని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. అగ్నివీర్ ల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్ (ఆర్టిలరీ) తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారని తెలిపారు. అనుకోకుండా గన్ నుంచి షెల్ మిస్ ఫైర్ కావడంతో గోహిల్ విశ్వరాజ్ సింగ్(20), సైఫత్ షిత్(21) తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
వెంటనే వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆస్పత్రికి తరలించామన్నారు. అప్పటికే ఆ ఇద్దరు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని వెల్లడించారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.