పాక్‌‌లో టెర్రర్‌‌‌‌ ఎటాక్‌‌..ఏడుగురు సోల్జర్లు మృతి

పెషావర్‌ ‌‌‌:  పాకిస్తాన్‌‌లో జరిగిన టెర్రర్‌‌‌‌ ఎటాక్‌‌లో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు సహా ఏడుగురు మృతి చెందారు. శనివారం ఆఫ్గనిస్తాన్‌‌ బార్డర్‌‌లోని నార్త్ వజీరిస్తాన్‌‌ దగ్గర మిర్‌‌‌‌ అలీ సెక్యూరిటీ చెక్‌‌ పోస్ట్‌‌పై ఆరుగురు టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులు చేసేందుకు వచ్చారని మిలిటరీ అధికారులు తెలిపారు. టెర్రరిస్టుల చొరబాటును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో పేలుడు పదార్థాలు ఉన్న ఓ వెహికల్‌‌తో చెక్‌‌పోస్ట్‌‌ ఢీకొట్టారన్నారు. ఆ తర్వాత టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. వెంటనే గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపి, ఆరుగురు టెర్రరిస్టులను మట్టుపెట్టారన్నారు.