వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వికాస్, ఒరిస్సాకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని జగదల్ పూర్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు పోలీసులు. అక్రమంగా తరలించి గంజాయి అమ్ముతున్న వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికే ఈ ఏడాది14 కేసుల్లో 39 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని.. అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.