నల్లమందు ముఠా అరెస్ట్‌‌‌‌

  • రాజస్థాన్‌‌‌‌ నుంచి  హైదరాబాద్​కు సప్లయ్

    
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అడ్డాకూలీలకు నల్లమందు  సప్లయ్ చేస్తున్న​ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులను పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి నల్లమందు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేస్తున్న ఇద్దరిని ఈస్ట్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.2.5లక్షలు విలువ చేసే 1400 గ్రాముల ఓపీయం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరాలు వెల్లడించారు.

రాజస్థాన్‌‌‌‌కు చెందిన హనుమాన్‌‌‌‌ రామ్‌‌‌‌ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్నాడు. జీడిమెట్లలోని కెమికల్ కంపెనీల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ నల్లమందుకు అలవాటయ్యాడు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఉండే రాజస్థాన్‌‌‌‌కు చెందిన చున్నీలాల్​తో కలిసి నల్లమందు సప్లయ్​కు ప్లాన్ చేశాడు. రాజస్థాన్‌‌‌‌ పిట్‌‌‌‌కషిమికి చెందిన కిల్లు వద్ద నల్లమందు కొనుగోలు చేసేవారు. జీడిమెట్ల ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియాలో పనిచేస్తున్న వలస కార్మికులకు నల్లమందు సప్లయ్ చేసేవారు.ఈ క్రమంలోనే రూ.1.18 లక్షలు విలువ చేసే 1400 గ్రాముల నల్లమందును హైదరాబాద్‌‌‌‌ తీసుకొచ్చారు. 360 గ్రాములు సికింద్రాబాద్‌‌‌‌లో సేల్‌‌‌‌ చేశారు.1040 గ్రాములతో గౌలిగూడ్‌‌‌‌లోని ఎస్‌‌‌‌జేడీ టీ పాయింట్‌‌‌‌ వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు.. హనుమాన్‌‌‌‌రామ్‌‌‌‌, చున్నీలాల్‌‌‌‌ను అరెస్ట్ చేశారు. మొత్తం 1400 గ్రాముల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు.