సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. స్టాక్ మార్కెట్ లో భారీ లాభాల పేరిట ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 2 కోట్ల 43 లక్షలు స్వాహా చేశారు. పటాన్ చెరు పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట సోషల్ మీడియాలో అడ్వటైజ్ మెంట్ మెసేజ్ వచ్చింది. దీంతో స్పందించిన సదురు ప్రైవేటు ఉద్యోగి మెసేజ్ ను క్లిక్ చేసి పెట్టుబడులు పెట్టాడు.
ఇలా నెలరోజుల వ్యవధిలో 22 ధపాలుగా రూ. 2 కోట్ల 43 లక్షల పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడికి ఎంత కాలమైనా లాభాలు రాకపోవడంతో మోసపోయానని బాధితుడు గ్రహించాడు. అనంతరం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లాభాల పేరు చెప్పగానే నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.