
హైదరాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ణానిక దినోత్సవ వేడుకలు రెండోరోజు జరుగుతున్నాయి. రెండో రోజు ఈ వేడుకల్లో సైన్స్ ఆవిష్కరణలు ప్రదర్శిస్తారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శన నిర్వహిస్తారు.
ఈ కార్యాక్రమం ద్వారా విద్యార్థులు విజ్ఞానం, సాంకేతికతో నూతన పరిణామాలు అన్వేషించుకునే అవకాశం ఉంటుంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు ,కళాశాలల నుండి సుమారు 2,700 మంది పాల్గొన్నారు.