వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం ఫర్నిచర్ తయారీ కంపెనీ బిల్డింగ్ పైకప్పుపై కూలింది. ఆరెంజ్ కౌంటీలోని ఫుల్లెర్టన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో 18 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.
విమానం కూలడం వల్ల భారీ మంటలు ఎగిసిపడటంతోపాటు బిల్డింగుకు పెద్ద రంధ్రం పడింది. దీంతో విమానంలో ఉన్న వారితో పాటు భవనంలో ఉన్న కార్మికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని వివరించారు. సింగిల్ ఇంజిన్, నాలుగు సీట్లు మాత్రమే ఉన్న ప్లేన్..ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యిందని..గాలిలోకి లేచిన రెండు నిమిషాలలోపే10కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని చెప్పారు.