నాగర్ కర్నూల్ టౌన్, జమ్మికుంట, హాలియా, వెలుగు: అప్పుల బాధతో శుక్రవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురుకు చెందిన పురం నరసింహ(45) పంటసాగు కోసం రూ.8 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది పంట దిగుబడి అంతగా రావడంతో అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై, శుక్రవారం తన పొలంలో ఉరేసుకొని చనిపోయాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన కడుగాల శ్రీనివాస్(42) ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తి, మక్క సాగు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో కౌలుకు తీసుకున్న పొలం వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా, తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
వడదెబ్బతో మరో రైతు
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నీమా నాయక్ తండాలో వడదెబ్బతో రైతు చనిపోయాడు. తండాకు చెందిన రామావత్ బాలు (33) వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లి అస్వస్థతకు గురై ఇంటికి వచ్చాడు. వాంతులు చేసుకోగా అతడి భార్య నాగార్జునసాగర్ లోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బాలు చనిపోయాడు.