హైదరాబాద్లో 2 గంటలు భారీ వాన..రోడ్లు,లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్లో 2 గంటలు భారీ వాన..రోడ్లు,లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు         
  • బల్దియా, వాటర్ బోర్డు అలర్ట్ 

హైదరాబాద్,వెలుగు : సిటీలో గురువారం ఒక్కసారిగా పడిన భారీ వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం 7 గంటలకు మొదలై రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కురిసింది. బన్సీలాల్ పేటలో  అత్యధికంగా 8.75 సెం.మీ, ఖైరతాబాద్ లో అత్యల్పంగా 6.30 సెం.మీ వర్షపాతం చొప్పున నమోదైంది.  ప్రధానంగా మాదాపూర్​, కొండాపూర్, హైటెక్​సిటీ, అమీర్​పేట, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్​, ముషీరాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్​రోడ్స్​, నాంపల్లి, రాజ్​భవన్​రోడ్​, లక్డీకాపూల్​, దిల్​సుఖ్​నగర్​, ముసారాంబాగ్​, మలక్ పేట తదితర ప్రాంతాల్లో వాన పడింది. పంజాగుట్ట, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, మాసాబ్​టాంక్​, మెహదీపట్నం రోడ్​, బేగంపేట

ఎల్ బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్​జామ్​ ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. భారీ వానతో జీహెచ్​ఎంసీ అధికారులు ప్రత్యేక టీమ్ లతో రంగంలోకి దిగారు. భారీ వానతో జనం అలర్ట్ గా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఎమర్జెన్సీ  అయితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040–21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. 

ఏరియా                          సెంటి మీటర్లు

బన్సీలాల్ పేట్                     8.75 
పాటిగడ్డ                                  8.53
 సరూర్ నగర్                         8.35
 ముషీరాబాద్                        8.05
 హిమాయత్ నగర్                6.95
సైదాబాద్                               6.88
ఆర్ సీపురం                           6.88
కూకట్ పల్లి                            6.65
బేగంపేట్                               6.50
ఖైరతాబాద్                            6.30