అమెరికాలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన ఇద్దరికి జైలు శిక్ష విధించించి కోర్టు.కంపెనీ క్లయింట్ , రుణదాతలు, పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలతో రిషి షా(38) కు ఏడున్న రేళ్లు, శ్రద్ధ అగర్వాల్ కు మూడేళ్లు జైలుశిక్ష పడింది. రిషా షా,శ్రధ్ధ అగర్వాల్ ఇద్దరూ చికాగోలోని ఔట్ కమ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీలో మాజీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరు రూ. 7వేల 500 కోట్ల మోసాలకు పాల్పడినట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది. ఈ కేసులో అదే కంపెనీ లో పనిచేసిన మరో నిందితుడు బ్రాడ్ పర్డీ కు రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష పడింది.
2006లో ఈ కంపెనీనీ రిషా షా, అగర్వాల్ స్ధాపించారు. దీనిని 2017 తర్వాత కంటెక్ట్స్ మీడియా ప్రియర్ పేరుతో యూనైటెడ్ స్టేట్స్ అంతగా ఉన్న ఆస్పత్రులకు టెలివిజన్ స్క్రీన్లు, టాబ్లెట్ లను ఏర్పాటు చేసి అడ్వర్టైజ్ మెంట్ చేసుకునేందుకు స్థలాన్ని అవకాశం కల్పిస్తారు. అవుట్ కమ్ లో ఎక్కువ భాగం కస్టమర్లు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. ఇతరుల అడ్వర్టైజ్ మెంట్లను అవుట్ కమ్ కస్టమర్లు అమ్మడం ద్వారా భారీ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు.
షా, అగర్వాల్ , పర్డీ అబద్ధాలు చెప్పారని, క్లయింట్ల నుంచి తక్కువ డెలివరీలను దాచిపెట్టి..కాంట్రాక్ట్‌లలోని స్క్రీన్‌లకు కంపెనీ అడ్వర్టైజింగ్ కంటెంట్‌ను డెలివరీ చేస్తున్నట్లుగా అబద్ధం చెప్పారని తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికీ తన క్లయింట్‌లను పూర్తిగా డెలివరీ చేసినట్లుగానే ఇన్‌వాయిస్ చేసింది. షా, అగర్వాల్, పూర్డీ కూడా అవుట్‌కమ్ రుణదాతలు, పెట్టుబడిదారులను మోసం చేశారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది.