- నేపాల్‌లో ఘోర ప్రమాదం,,
- మృతుల్లో ఇద్దరు భారతీయులు
ఖాట్మండు: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుల బస్సు అదుపు తప్పి రఫ్తీ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా12 మంది మృతి చెందారు. 23 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని లుంబినీ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
బస్సు ఖాట్మండు నుంచి నేపాల్ గంజ్‌కు వెళ్తోంది. భాగలు బంగ్ లోని రఫ్తీ బ్రిడ్జిపైకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి నదిలోకి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం నేపాల్ గంజ్ మెడికల్ టీచింగ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియ లేదని పోలీసులు చెప్పారు. దర్యాప్తు కోసం బస్సు డ్రైవర్ లాల్ బహదూర్ నేపాలీని కస్టడీలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.