
న్యూఢిల్లీ: ఈ వారం రెండు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానుండగా, ఐదు కంపెనీలు మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో నూక్లియస్ ఆఫీస్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల 24న ఓపెన్ కానుంది. 27న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.234 ధరకు కంపెనీ అమ్మనుంది. మరో ఎస్‌ఎంఈ ఐపీఓ శ్రీనాథ్ పేపర్ ఐపీఓ ఈ నెల 25న ఓపెనై, 28న ముగుస్తుంది.
ఒక్కో షేరుని రూ.44 గా నిర్ణయించారు. ఈ రెండింటితో పాటు ఈ నెల 20న ఓపెనైన హెచ్‌పీ టెలికం ఇండియా లిమిటెడ్ ఐపీఓ, 24న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.108 గా నిర్ణయించారు. మరోవైపు మెయిన్‌బోర్డ్ ఐపీఓ క్వాలిటీ పవర్ ఈ నెల 24 న మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్ నుంచి రాయల్కార్ ఎలక్ట్రోడ్స్, తేజస్ కార్గో, స్వస్త్ ఫుడ్ టెక్, హెచ్‌పీ టెలికం ఈ వారం మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి.