ఇరాన్ ఏజెంట్లతోనే హమాస్ చీఫ్ హత్య

ఇరాన్  ఏజెంట్లతోనే హమాస్ చీఫ్ హత్య
  • 3 గదుల్లో బాంబులు పెట్టించి మట్టుబెట్టించిన ఇజ్రాయెల్!

న్యూఢిల్లీ: హమాస్  చీఫ్  ఇస్మాయెల్  హనియా హత్య గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్  ఇంటెలిజెన్స్  సంస్థ మొసాద్.. ఇద్దరు ఇరాన్  సెక్యూరిటీ ఏజెంట్లతోనే మూడు గదుల్లో బాంబులు పెట్టించి హనియాను హత్య చేయించిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హనియా బసచేసిన భవనంలో ఇరాన్ కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ ఏజెంట్లు మూడు గదుల్లో బాంబులు పెట్టారని తెలిపాయి. వాస్తవానికి ఇరాన్  మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు హాజరైనపుడే హనియాను చంపేందుకు ప్లాన్  వేశారని, ఆ సమయంలో అంత్యక్రియల్లో జనం భారీగా పాల్గొనడంతో ఆ ప్లాన్ ను విరమించుకున్నారని ఇరాన్  అధికారులు.. టెలిగ్రాఫ్  దినపత్రికకు తెలిపారు. తర్వాత ప్లాన్  మార్చి హనియాను హత్య చేశారని వారు ఆరోపించారు.