మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. బోరబండకు చెందిన ఆకాంక్ష (24), రఘుబాబు (24) ఫ్రెండ్స్. ఆకాంక్ష బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తుండగా, రఘుబాబు హైటెక్ సిటీలో పనిచేస్తున్నాడు. ఆకాంక్ష సెలవు పెట్టి గురువారం రాత్రి సిటీకి వచ్చాడు. అనంతరం ఇద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత టిఫిన్ చేయడానికి బోరబండ నుంచి మాదాపూర్‌కు బైక్ పై బయలుదేరారు.
పర్వత్ నగర్ సిగ్నల్ దాటిన తర్వాత బైక్ ను రఘుబాబు ఓవర్ స్పీడ్ గా నడుపడంతో వెహికల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు మాదాపూర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.