వెస్ట్ బెంగాల్ లో రెచ్చిపోయిన బీహార్ దొంగలు: ఐదుగురు అరెస్ట్

పశ్చిమ బెంగాల్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.  రెండు జ్యాయలరీ షాపుల్లో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు పట్టుకొనేందుకు ప్రయత్నించగా వారిపై కాల్పులు జరిపారు.  

పశ్చిమ బెంగాల్ లో    రెండు బంగారం షాపుల్లో మంగళవారం ( ఆగస్టు 29) మధ్యాహ్నం  దొంగతనం జరిగింది. సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన దుకాణాల్లో  చోరీ జరిగింది.  నాడియా జిల్లాలోని రానాఘాట్‌లో జ్యువెలరీ షోరూమ్‌లో, పురూలియా జిల్లాలో ని ఓ జ్యూయలరీ షాపులో మంగళవారం ( ఆగస్టు 29) మధ్యాహ్నం దొంగలు చొరబడ్డారు.  అయితే  ఈ రెండు దొంగతనాలు ఒకే ముఠాకు చెందిన వారు తస్కరించారని పోలీసులు భావిస్తున్నారు. 

ALSO READ :రూటు మార్చిన గంభీర్.. కోహ్లీ గొప్పోడు అంటూ పొగడ్తలు

పశ్చిమ బెంగాల్ లోని  నాడియా జిల్లాలోని రానాఘాట్‌లో జ్యువెలరీ షోరూమ్‌లో చోరీకి పాల్పడి చోరీకి పాల్పడిన  ఐదుగురు వ్యక్తులను మంగళవారం ( ఆగస్టు 29) అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  రణఘాట్‌లోని రత్తాల రైల్ గేట్ ప్రాంతంలోని జ్యూయలరీ షాపులోకి ఎనిమిది మంది దుండగులు ప్రవేశించి.. దుకాణంలోని సిబ్బందిని తుపాకులతో బెదిరించారు.  అయితే  సీసీ కెమెరాను పరిశీలించిన వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించగా 10 నిమిషాల్లోనే  ఒక పోలీస్ బృందం వచ్చింది.  పోలీసులను గమనించిన దుండగులు కాల్పులు జరిపారు.   పోలీసులు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు దొంగలు కాళ్లకు  బుల్లెట్లు తగిలి గాయాలయి పట్టుబడ్డారు. మిగతా వారు పారిపోతుండగా వెంబడించి మరో ఇద్దరిని పట్టుకున్నారు.  అదే రోజు తెల్లవారుజామున పోలీస్ గస్తీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు రణఘాట్  జిల్లా ఎస్పీ కె కణ్ణన్ తెలిపారు. నిందితులు బీహార్ నుంచి వచ్చారని పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి నాలుగు మారణాయుధాలు, 22 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో అపహరించిన నగలతోపాటు మరికొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కె కణ్ణన్  తెలిపారు.