గ్రామాలపై ఏనుగుల దాడి : ఇద్దరు గిరిజనులను తొక్కి చంపేశాయి..!

గ్రామాలపై ఏనుగుల దాడి : ఇద్దరు గిరిజనులను తొక్కి చంపేశాయి..!

కేరళ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సం చేశాయి. త్రిసూర్ జిల్లా అతిరప్పిల్లి అటవీ ప్రాంతంలోని గ్రామాలపై ఏనుగుల గుంపులు దాడి చేశాయి. ఆ గ్రామంలో నివసించే గిరిజనులపై.. వారి ఇళ్లల్లోకి వచ్చాయి ఏనుగులు. ఏనుగుల గుంపును తరిమి క్రమంలో.. ఏనుగుల గుంపులు జనంపైకి దూసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఇద్దరు గిరిజనులు ఏనుగుల కాళ్ల కింద పడి నలిగిపోయారు. వీళ్లను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

2025, ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారి 30 ఏనుగులు.. గుంపులుగా గ్రామాల్లోకి రావటంతో జనం పరుగులు తీశారు. ఈ క్రమంలోనే సతీష్, అంబిక అనే ఇద్దరు ఏనుగుల దాడిలో చనిపోయారు. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు వచ్చే సమయానికే ఏనుగులు తిరిగి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు స్థానికులు.

రెండు రోజుల క్రితం కూడా అతిరప్పిల్లి ఏరియాలోనే.. ఏనుగుల దాడిలో 20 ఏళ్ల సెబాస్టియన్ అనే గిరిజనుడు చనిపోయాడు. వారం రోజుల్లోనే ఇది రెండో ఘటన.. మొత్తం ముగ్గురు చనిపోవటంతో.. అతిరప్పిల్లి అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా డప్పులు వాయించటం.. టపాసులు కాల్చటం వంటివి చేస్తున్నారు.