ఉమ్మడి నల్గొండ జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు భరించలేక కస్టమర్లు బీర్ల సీసాలు ఖాళీ చేస్తున్నారు. మద్యం ప్రియులు చల్లని బీర్లతో చీర్స్ కొడుతున్నారు.
రోజుకు 17 వేల పెట్టెలు ఖాళీ..
ఒకవైపు ఫంక్షన్లు, మరోవైపు ఎండల తీవ్రత కారణంగా బీర్ల గిరాకీ జోరుగా సాగుతోంది. ఒక్క మార్చిలోనే రోజుకు 17,852 పెట్టెలు చొప్పున 30 రో జుల్లో సమారు 5,35,589 పెట్టెలు ఖాళీ చేశారు. గతేడాది మార్చిలో 5, 03,732 పెట్టెలు అమ్ముడు పోగా, ఈసారి అదనంగా 31,857 పెట్టెలు సేల్అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 ఎస్హెచ్ల పరిధిలో 355 వైన్స్షాపులు ఉండగా, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, మో త్కూరు మినహా మిగిలిన అన్ని ఎస్హెచ్వోల పరిధిలో బీర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి.
లిక్కర్ సేల్స్ మాత్రం భారీగా తగ్గాయి. గతేడాది మార్చిలో 2,99, 051 వేల పెట్టెలు అమ్ముడుకాగా, ఈ ఏడాది ఇదే రోజుల్లో 2,8 4,910 పెట్టెలకు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 14,141 కాటన్ల సేల్స్తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గింది. 2023 మార్చిలో లిక్కర్ సేల్స్ ద్వారా రూ.316.8 0 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.299.17 కోట్లు వచ్చింది. గతేడాదితో పో లిస్తే రూ.17.63 కోట్ల ఆదాయం పడిపోయింది.
యాదాద్రి జిల్లాలో లిక్కర్ సేల్స్ డౌన్..
యాదాద్రి జిల్లాలోనే లిక్కర్ సేల్స్ భారీగా పడిపోయాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఎస్హెచ్లో పరిధిలోనే 10,247 కార్టన్ల సేల్స్తగ్గాయి. పార్లమెంట్ఎన్నికల కోడ్ ను అధికారులుపక్కాగా అమలు చేయడంతో గ్రామాల్లో బెల్టు షాపులను బంద్ చేశారు. గత 45 రోజుల నుంచే బీర్లు షార్టేజ్ అయ్యాయని, ప్రస్తుతం కేఎఫ్ తప్ప ఇతర ఏ కంపెనీల బ్రాండ్లు డిపోల్లో స్టాక్ లేదని అధికారులు చెబుతున్నారు.