రైతులకు గుడ్ న్యూస్ : 2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 2024, ఆగస్ట్ 15వ తేదీలోపు బ్యాంకుల్లోని 2 లక్షల రూపాయల అప్పు మాఫీకి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి మంచి విషయం చెప్పారు. రుణ మాఫీకి సంబంధించిన విధివిధానాలను 2 రోజుల్లో విడుదల చేస్తున్నామని వెల్లడించారాయన. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. జూలై 9వ తేదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారాయన. రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు. 

ఆగస్టు 15 లోగా పూర్తి చేస్తము..నిధుల సమీకరణ స్టార్ట్ అయింది..రేపు రైతు భరోసా పై ఖమ్మం లో అభిప్రాయం సేకరణ స్టార్ట్ చేస్తున్నాము..రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతలు అభిప్రాయం లు తీసుకుంటున్నాము.. నేను ఇంత వరకు రైతు బంధు తీసుకోలేదు చెక్ లు ఇచ్చిన తిరిగి ఇచ్చానని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.