మందమర్రి పట్టణంలో వైన్స్​లో చొరబడి 2 లక్షలు చోరీ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలోని ఓ వైన్స్​లోని సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.2 లక్షలకు పైగా క్యాష్ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు వైన్​షాప్ యాజమాని మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు షాపు పైభాగం సిమెంట్​రేక్​లు పగులగొట్టి లోపలికి వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.