75 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నైజీరియన్ మహిళల అరెస్టు

75 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నైజీరియన్ మహిళల అరెస్టు

మంగళూరు: భారీ మొత్తంలో డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నైజీరియన్ మహిళలను ఆదివారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75 కోట్ల విలువ చేసే 37 కిలోలకుపైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకలో ఇప్పటివరకు తాము సీజ్ చేసిన భారీ మొత్తం ఇదేనని  పోలీసులు తెలిపారు. బాంబా ఫాంటా (31), అబిగైల్ అడోనిస్ (30) ఢిల్లీలో నివసిస్తూ దేశం అంతటా డ్రగ్స్ ను  అక్రమంగా రవాణా చేస్తున్నారు. 

వారు తమ ట్రాలీ బ్యాగుల్లో ఎండీఎంఏను బెంగళూరుకు తీసుకొస్తుండగా ఆదివారం ఎయిర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, పాస్ పోర్టులు, రూ.18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను రవాణా చేయడానికి వారు విమాన మార్గాలను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ముంబైకి 37, బెంగళూరుకు 22 ట్రిప్పులు వేశారని పేర్కొన్నారు. గత 12 ఏండ్లుగా వారు డ్రగ్స్ రవాణాలో పాలు పంచుకుంటున్నారని వెల్లడించారు.