ఉమ్మడి వరంగల్​లో సీన్‌‌ రివర్స్‌‌

  •     2018లో కాంగ్రెస్‍కు 2, ఇప్పుడు బీఆర్‍ఎస్‌‌కూ రెండే

వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‍ లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍కు అనుకూలంగా, కాంగ్రెస్‍ కు ప్రతికూలంగా సీట్లు వచ్చాయి. 12 నియోజకవర్గాలకు అప్పుడు బీఆర్‍ఎస్‍ 10 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్‍  తరఫున ములుగు నుంచి ధనసరి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రమే విజయం సాధించారు. తర్వాత గండ్ర..

బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‍  రివర్స్  అయింది. అధికార బీఆర్‍ఎస్‍ నుంచి  స్టేషన్‍  ఘన్‍పూర్‍లో  కడియం శ్రీహరి, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా 10 స్థానాల్లో కాంగ్రెస్‍  జయకేతనం ఎగురవేసింది.