జమ్మూలో టెర్రర్ అటాక్.. ఇద్దరు సైనికులు మృతి

జమ్మూలో టెర్రర్ అటాక్.. ఇద్దరు సైనికులు మృతి

న్యూఢిల్లీ:జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. అఖ్నూర్ సెక్టార్​లో అనుమానాస్పద ఐఈడీ పేలడంతో ఇద్దరు సైనికులు చనిపోయారు. ఈమేరకు మంగళవారం ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టింది. 

ఆ వీర సైనికుల త్యాగానికి నివాళులర్పిస్తున్నామని చెప్పింది. టెర్రరిస్టుల ఆచూకీని కనుగొనడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పేర్కొంది. నియంత్రణ రేఖ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీ) వెంట ఉన్న కంచె వద్ద సైనికులు గస్తీ నిర్వహిస్తుండగా ఐఈడీ  పేలింది. కాగా,  సోమవారం కూడా ఎల్ వోసీ వెంట టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.