న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యునివర్సిటీ(జెఎన్ టియు) విద్యార్థులు భరత్ చంద్రా(19), పి సునీత్(18), ఎం వంశీ(19)లు డిసెంబర్ 31న అర్థరాత్రి కొత్త సంవత్సరం వేడుకలకు హాజరై.. 2024, జనవరి 1వ తేదీ సోమవారం తెల్లవారుజామును బైక్ పై తిరిగి వస్తుండగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో డివైడర్ ను ఢికొట్టారు. ఈ ప్రమాదంలో భరత్ చంద్ర, సునీత్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వంశీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఓ స్కోడా కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. మిత్రహిల్స్ నుండి హైదర్ నగర్ వైపు వెళ్తుండగా బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించారు. మృతుడిని మోతి నగర్ కి ప్రయివేట్ ఉద్యోగి చెందిన అరుణ్(33)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని KPHB పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.