
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. శనివారం వేకువజామున మొదటగా ఖన్యార్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. రంగంలోకి దిగిన సిబ్బంది కార్డన్ సెర్చ్ చేపట్టారు.
ఈ క్రమంలోనే భద్రత దళాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు మృతి చెందాడు. నలుగురు భద్రతా సిబ్బంది గాయాలపాలయ్యారు. కాగా, అనంత్‌నాగ్ జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. షాంగస్- లర్నూ ప్రాంతంలోని హల్కన్ గలి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.