ఐదు రాష్ట్రాల్లో 2 వేల కోట్లు సీజ్

ఐదు రాష్ట్రాల్లో 2  వేల కోట్లు సీజ్

న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌గఢ్, రాజస్థాన్‌‌, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.2000 కోట్లకుపైగా నగదు పట్టుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇవే రాష్ట్రాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికలప్పటితో పోలిస్తే ప్రస్తుతం పట్టుకున్న మొత్తం ఏడు రెట్లు ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా ఉల్లంఘనలపై కేసులు ఫైల్ చేశామని, షోకాజ్ నోటీసులు ఇచ్చామని ఈసీ చెప్పింది. 

తెలంగాణలో రైతు బంధు పథకం డబ్బుల పంపిణీని ఆపేయడం, వికసిత్ భారత్ కార్యక్రమాలను కూడా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ సీఎం కేసీఆర్​కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.