దేవుని బిడ్డగా.. జీసస్ ఈ రోజు భూమ్మీదకు వచ్చాడు. వస్తూ వస్తూ.. అనంతమైన ప్రేమను తీసుకొచ్చాడు. ఆ ప్రేమ కోసమే తన రక్తాన్ని ధారపోశాడు. ఈ లోకాన్ని.. పరలోకం వైపు నడిపించడానికి తాను శిలువ మోశాడు. తనని బాధ పెట్టిన వారిని క్షమించాడు. సమస్త లోకాన్ని ప్రేమతో నింపమన్నాడు. ఇలా ఆయన రెండు వేల ఏళ్ల కింద బోధించిన ఈ జీవిత పాఠాలు.. కాలాతీతం! ఈ భూమ్మీద మనిషి బతికున్నంత వరకూ అవి అనుసరణీయమే. క్రీస్తు చూపిన బాటలో నడిచేవాడినే క్రిస్టియన్ అంటారు. జీసస్ జీవితం ఆధారంగా మనం చాలా జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. వాటిని ఆచరించి దేవుడి రాజ్యంలో స్థానం సంపాదించొచ్చు.
'హరయపూర్వకంగా నీ దేవుడిని ఆప్రేమించు నీ మనసుతో, ఆత్మతో అతడ్ని ప్రేమించు. ఇదే మొదటి కమాండ్ మెంట్'-- మాథ్యూ --22/36/38 మనిషి నిత్యం వస్తువుల్ని మనుషుల్ని ప్రేమిస్తుంటారు. అవి కావాలి ఇవి కావాలి' అని ఆ దేవుడే కోరుకుంటూనే.. దేవుడి కంటే కూడా వాటినే ఎక్కువ ప్రేమిస్తాడు. అయితే, దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా చివరికి అవి కష్టాలపాలు చేస్తాయి. కాబట్టి. దేవుడి కన్నా ఎక్కువ దేనినీ ప్రేమించకూడదు. హృదయపూర్వకంగా దేవుడ్ని ప్రేమించినప్పుడు. నీకు కావాల్సినవన్సీ నువ్వు ఉన్న చోటకే చేరుతాయి!
ఇతరులను ప్రేమించాలి
"నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటారో పొరుగువారిని కూడా అలాగే ప్రేమించు.." -మార్యూ 22:39
కచ్చితంగా మనల్ని మసం ప్రేమించుకుంటాం. మనకోసం మనం రోజూ చాలా చేసుకుంటాం. మనలో ఉండే స్వార్థం వల్ల మనది మనం ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించలేం. కానీ, జీసస్ ఇతరులను ప్రేమించమని చెప్పాడు. ఎవరైతే వింటున్నారో వాళ్లకు చెప్తున్నాను. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించేవారికి కూడా మంచి చేయండి' అని లూకే 6:27లో చెప్పాడు. కాబట్టి, నచ్చిన వాళ్లనే కాదు. నచ్చని వాళ్ళను, శత్రువులను ప్రేమించడం మొదలు పెట్టాలి. ఈ ఒక్క కమాండ్ మెంట్ పాటించి గొప్పవాళ్లుగా ఎదిగిన వాళ్లు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు.
ALSO READ : Christmas 2024: క్రిస్మస్ చెట్లు.. ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్ఠత.. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చెట్లు ఎందుకు..!
దేవుడి రాజ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు.
"దేవుడి రాజ్యాన్ని పరిశీలనతో అనుభవంలోకి రాదు. చూడు..చూడు అది ఇక్కడ ఉంది. అక్కడ ఉంది' అని చెప్పలేం. అది నీలోనే ఉంది. లూక్ 17:-20-:21
అసలు దేవుడి రాజ్యం అంటే ఏంటి? ఎక్కడుంది? అనే సందేహం కలుగుతుంది.. ఇది వస్తువులతో కూడిన భౌతిక రాజ్యం కాదు. అది ఆధ్యాత్మిక రాజ్యం. దేవుడి రాజ్యంలో అన్యాయం, హింస నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఇక్కడే బాధల తాలూకు గాయాలన్నీ మానిపోతాయి. ఆ రాజ్యంలో అళ, శాంతి, సంతోషం ఉంటాయి! దేవుడే రాజ్యాన్ని అన్వేషిస్తే ఆయనే మన ఆలనా పాలనా చూసుకుంటాడు.
డబ్బుని ప్రేమించనప్పుడే..
డబ్బు స్వయంగా చెడ్డదేం కాదు. కానీ, ఎప్పుడు డబ్బుని విపరీతంగా ప్రేమించినా అదీ కష్టాలకు దారి తీస్తుంది. శాసించే ఇద్దరిని ఒకేసారి ఎవరూ కొలవలేరు. రెండింట్లో ఒకదాన్ని ద్వేషిస్తే మరొకదాన్ని ప్రేమిస్తారు. లేదా ఒకదాన్ని భక్తితో స్వీకరిస్తే మరొకదాన్ని నిరసన భావంతో చూస్తారు. దేవుడ్ని డబ్బుని ఒకేసారి సేవించలేరు' అని మార్కూ 6:24లో అంటాడు జీసస్ గుర్తుంది కదా! దేవుడి కన్నా ఎక్కువదేన్ని ప్రేమించినా కష్టాలు తప్పవు ఆయన మీ హృదయంలోనే ఉన్నాడు. డబ్బుని ప్రేమించనప్పుడే.. డబ్బుతో చాలా మంచి పనులు చేయగలం. డబ్బుని మనం కంట్రోల్ చేయాలి. కానీ, డబ్యే మనల్ని కంట్రోల్ చేయకూడదు.
ALSO READ : Christmas 2024 : మెదక్ చర్చి.. 10 ఏళ్ల నిర్మాణం.. మెతుకు సీమను అన్నంపెట్టి ఆదుకుంది..!
చింతించకండి..మీ కనీస అవసరాలను దేవుడే తీరుస్తాడని విశ్వసించండి
అందుకే మీకు చెప్తున్నాను. నీజీవితం గురించి చింతించకు. శరీరం గురించి తిండి గురించి అంతగా ఆలోచించకు. తిండి కంటే జీవితం దుస్తులు కంటే శరీరం విలువైనది '- మాథ్యూ 6:24
మనకు రోజూ అవసరమైన తిండి, బట్టలు గురించి అందరూ నిత్యం ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే బదులు దేవుడిపై విశ్వాసం ఉంచండి. ఆయనే మన సంరక్షకుడు కాబట్టి మనకు కావాల్సినవన్నీ ఆయనే సమకూరుస్తారు. దేవుడు ఎప్పటికీ మనల్ని కిందపడిపోనీయడు.
సేవ చేయడం వల్లే ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకుంటారు
ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏంచేయాలి? ఒకటి ఎప్పుడూ దేవుడి నామాన్ని స్కరిస్తూ. ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి జీసస్ సూచించిన మార్గాల్లో జీవితం గడపాలి. అబద్దపు సాక్ష్యాలు చెప్పకూడదు.. తల్లిదండ్రులను గౌరవించాలి. వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే. ఇతరులనూ ప్రేమించాలి. క్షమాగుణం కలిగి ఉండాలి. పదులకు సేవ చేయాలి' అని జీనస్ చెప్పాడు. ఇవన్నీ చేయాలంటే మనిషి కష్టంగా ఉంటుంది. దానికి బదులు తేలికైనది దేవుడిని కీర్తించడమే! కానీ, మనిషి తన పని తేలికవుతుందని భావించడంలోనే అలృత్యం.. స్వార్థం బయటపడుతుంది. నిజాయితీగా సేవ చేయడం పట్టే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వాళ్లకే దేవుడి రాజ్యంలోకి ప్రవేశం ఉంటుంది.
ALSO READ : Christmas 2024: క్రిస్మస్ బెల్స్.. గంటల విశిష్ఠత ఏంటీ.. చర్చిలో గంటలు ఎందుకు మోగిస్తారు..!
"మీలో అందరికంటే గొప్పవారు సేవకులు అయిఉండాలి. తనను తాను తక్కువ చేసుకున్నవాడు గొప్పవాడు, తనను తాను పెంచుకున్నవాడు తగ్గించబడతాడు' అని మేథ్యూ 23-:11-:12లో జీసస్ నేర్పిస్తాడు. తన దేవుడి పేరు మీద ఇతరులకు సేవ చేసేవాడే గొప్ప ఆధ్యాత్మికవేత్త!
తప్పు చేసినవారిని క్షమించాలి
ఇతరులను క్షమించినప్పుడే. దేవుడు తన రాజ్యంలో మీరు చేసిన తప్పుల్ని క్షమిస్తాడు- మాథ్యూ 6:14-:15 తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడం తప్పు కాదు. వాళ్లు కోరినా, కోరకున్నా క్షమించడం. ఇంకా ఉన్నతమైంది. క్షమించడం వల్ల అన్నిటికీ మించి ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
మతమొక్కటే నిన్ను పవిత్రంగా మార్చదు
నోట్లోకి వెళ్లేది మనిషిని అపవిత్రంగా మార్చడు. నోటి నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రంగా మారుస్తుంది' అని మాథ్యూ 15:11లో చెప్తాడు. తినే వాటి వల్ల మనుషులు: అపవిత్రంగా మారదు మనిషిలోపల ఉండే మోహం, స్వార్థం. ద్వేషం, ఈర్ష వంటివి నోటి నుంచి మాటల రూపంలో బయటపడినప్పుడే మనిషి అపవిత్రమవుతాడు. మతం, నమ్మకాలు హృదయానికి చేరుకోకుంటే ఇవి మంచి చేయలేనంటాడు జీసస్.