నల్లగొండ జిల్లాలో బయటపడ్డ 2వేల ఏళ్లనాటి నాణేలు

నల్లగొండ జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడ్డాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో  బౌద్ద కళాఖండాలుగా  చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. 

2015లో కూడా ఫణిగిరి గ్రామంలో 2వేల ఏళ్ల నాటి బౌద్ద అవశేషాలను పురావస్త శాఖ వారు కొనుగొన్నారు. ఫణిగిరి క్రీపూ. 3 వ శతాబ్దం , క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్య కాలంలో బౌద్ద జ్ణానానికి సంబంధించిన ప్రధాన ప్రదేశం.  ఇది కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ద స్తూపం, విహారం, చైత్యాలకు ప్రసిద్ది చెందిన స్థలం ఇది. 

1941లో  అప్పటి  నిజాం ప్రభుత్వం ఫణిగిరి గ్రామంలో మొదటిసారి తవ్వకాలు జరిపారు. దాని తర్వాత 2002లో మరో తవ్వకం జరిగింది. ఆ తర్వాత 2015లో మరోసారి ఇవాళ (మార్చి 31,2024) న త్రవ్వకాలు జరిపారు. ఈ త్రవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత  పూర్వక స్థంభాలు కనుగొనబడ్డాయి.