ఏంటా వీరావేశం:కోర్టు బయట..లాయర్ను పరిగెత్తించి కొట్టిన అమ్మాయిలు

ఏంటా వీరావేశం:కోర్టు బయట..లాయర్ను పరిగెత్తించి కొట్టిన అమ్మాయిలు

ఇద్దరి మహిళలు వీరావేశంతో ఊగిపోయారు..ప్లేస్ ఏదైతేనేం మాకెవరు అడ్డు అని రెచ్చిపోయారు. కోర్టు ముందే లాయర్ గళ్లా పట్టుకుని వీరబాదుడు బాదారు..ఈడ్చితన్నారు.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు..లాయర్లు, కోర్టుకు వచ్చినవారు, సిబ్బంది చూస్తుండగానే ఇదంతా జరిగింది. లాయర్లు విడిపించే ప్రయత్నం చేసినా వారిపై కూడా దాడి చేశారు. పరుగెత్తి పారిపోతున్న లాయర్ వెంటపడి మరీ గుంచి కొట్టారు.ఉత్తరప్రదేశ్ బస్తీ కోర్టులో జరిగిన ఈ ఘటన..సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

గురువారం(ఏప్రిల్3)న గోరఖ్ పూర్ లోని బస్తీ సివిల్ కోర్టులో గేట్ నంబర్ 3 దగ్గర ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు ఓ లాయర్ పై బహిరంగంగా దాడి చేశారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.ఇద్దరు మహిళల దాడి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గోరఖ్ పూర్ స్థానిక మీడియా ప్రకారం..లాయర్ ఓ మహిళను ఫోన్ లో బూతులు తిట్టాడనే ఆరోపణలతో ఈ గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహించిన ఇద్దరు మహిళలు కోర్టు ఎంట్రన్స్ దగ్గర న్యాయవాదిని పట్టుకొని బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేశారు. ఇద్దరు మహిళలు న్యాయవాదిపై రెచ్చిపోయి దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

కోర్టులో ఉన్న మిగతా లాయర్లు కూడా జోక్యం చేసుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా మరింత రెచ్చిపోయిన మహిళలు దాడిని కొనసాగించారు. గొడవ జరుగుతున్న సమయంలో ఒక మహిళ జనసమూహంలో నిలబడి ఉన్న లాయర్ ను గళ్లా పట్టుకొని కొట్టడం, తన్నడం కనిపిస్తుంది. 

అయితే కోర్టుముందే లాయర్ పై దాడిని బార్ అసోసియేషన్ ఖండించింది. ఇద్దరు మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల తక్షణ స్పందించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు Xలో షేర్ చేశారు.