మెకానిక్ షెడ్ లో 20 బైక్​లు దగ్ధం

మెకానిక్ షెడ్ లో 20 బైక్​లు దగ్ధం

జగిత్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల బైక్​ మెకానిక్ షెడ్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 బైక్‌‌‌‌‌‌‌‌లకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాలకు చెందిన తిట్ల అన్వేష్ తన ఇంటి సమీపంలో ఓ మెకానిక్‌‌‌‌‌‌‌‌ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఆయన వేరే ఊరు వెళ్లగా షాపు మూసేసి ఉంది. 

శుక్రవారం షెడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో దాదాపు 20 బైక్‌‌‌‌‌‌‌‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితోపాటు ఇంట్లోని వస్తువులు కూడా కాలిపోయాయి. స్థానికులు గుర్తించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. షాట్ సర్క్యూట్ తోనా..? లేదా నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.