బోధన్, వెలుగు : మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే షకీల్సహకారంతో బోధన్పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైట్లు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారం, టౌన్ ప్రెసిడెంట్ రవీంద్రయాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వీరు మాట్లాడారు.
నెలరోజుల క్రితం మున్సిపాలిటీకి రూ.15.21 కోట్లు మంజూరయ్యాయని, మళ్లీ ఇప్పుడు రూ.20 కోట్లు కేటాయించారన్నారు. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు దూప్సింగ్, అబ్దుల్లా, జావీద్, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.