Lion Day : సింహం బరువు ఎంత.. ఎంత సేపు నిద్రపోతుంది.. జీవిత విశేషాలు..

Lion Day : సింహం బరువు ఎంత.. ఎంత సేపు నిద్రపోతుంది.. జీవిత విశేషాలు..

సింహం.. అడవికి రారాజు.. ఎంత పెద్ద గజరాజు అయినా తలవంచాల్సిందే.. సింహం నడుస్తుంటే చాలు గుండెలు అదురుతాయి.. అడవిలో ఎన్ని వందలు, వేల జంతువులు ఉన్నా.. సింహం దర్జానే వేరు. అందుకే అంటారు అంటారు.. బతికితే సింహంలా బతకాలని.. సింహం గాండ్రించింది అంటే అడవి దద్దరిల్లుతుంది.. సింహం నడిచి వస్తుంటే మిగతా జంతువులు అన్నీ పక్కకు జరగాల్సిందే.. సింహంతో వేట ఆషామాషీ కాదు.. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా.. అసలు సింహం ఎన్నాళ్లు బతుకుతుంది.. ఎంత బరువు ఉంటుంది.. ఎంత సేపు నిద్రపోతుంది.. సింహం జీవిత విశేషాలను ఓసారి చూద్దాం..

ALSO READ :ప్రపంచ సింహాల దినోత్సవం.. సింహాల సంఖ్యపై మోదీ ట్విట్

  • సింహాలు సాధారణంగా గుంపులుగా ఉండేందుకే ఇష్టపడతాయట. ఆ బృందంలో దాదాపు 15 సింహాల వరకు ఉండవచ్చట.
  • సింహాల వేగం గురించి చెప్పాలంటే, ఇవి గంటకు 80 మీటర్ల వరకు పరుగెత్తుతాయట. దాని హయ్యెస్ట్ జంప్ 36 అడుగుల వరకు ఉంటుందట. ఇక వాటి బరువు విషయానికొస్తే ఒక్కో సింహం 170 నుంచి 230 కిలోల వరకు ఉంటాయట. అందులో కొన్ని సింహాలు తక్కువ బరువును కూడా కలిగి ఉంటాయి. అంటే 120 నుంచి 180 కిలోల వరకు ఉండవచ్చట.
  • సాధారణంగా సింహాలు ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వాటి మెజారిటీ ఆఫ్రికాలో మాత్రమే ఉంది. ఆసియా సింహాల గురించి చెప్పాలంటే, గుజరాత్‌లోని ససన్ గిర్ నేషనల్ పార్క్‌లో దాదాపు 350-400 సింహాలు కనిపిస్తాయి.
  • సింహం గర్జన 5 మైళ్లు అంటే 8 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుందట. ఇది పులి గర్జన కంటే తక్కువ అట. సాదారణంగా పులి గర్జిస్తే 3 కిలోమీటర్ల దూరం వరకు ఆ సౌండ్ వినిపిస్తుందట.
  • సింహాలను అడవికి రాజు అని పిలుస్తారు. కానీ అవి అడవిలో కాకుండా మైదానాలలో నివసించడానికే ఎక్కువ ఇష్టపడతాయట. ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా అడవిలోనే ఉంటాయి. అందుకే వీటిని అడవికి రాజు అంటారేమోనని కొందరు భావిస్తూ ఉంటారు.
  • సింహాల వయస్సును వాటి ముఖం చుట్టూ ఉన్న పెద్ద వెంట్రుకలను బట్టి తెలుసుకోవచ్చట. ముదురు రంగులో ఉంటే సింహం వయసులో పెద్దదిగా భావించవచ్చట.
  • చివరగా మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సింహం నడిచినప్పుడు ఎప్పుడూ కూడా దాని మడమ నేలను తాకదట. అంతే కాదు అది రోజులోని 24 గంటలలో 20 గంటలు నిద్రించడం ద్వారా తన నిద్రను పూర్తి చేస్తుందట.