
ఏపీలోని విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువలసలోని ఓ ఇంట్లో నిన్న రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించాయి. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు కాలిపోయ్యాయి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు స్థానిక పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్టు చెప్పారు.
Andhra Pradesh | A fire breaks out in various houses of Jakkuva village in Mentada mandal, Vizianagaram around 10 pm last night.
— ANI (@ANI) November 12, 2021
"Fire under control. Those who lost their houses in the fire are being accommodated in the local school," said Vizianagaram DC Surya Kumari pic.twitter.com/OxpJyd8f7t