జుబా:దక్షిణ సూడాన్‌లో విషాదం చోటు చేసుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. చనిపోయిన వారిలో ఒక భారతీయుడు ఉన్నారు. గాయాలతో బయట పడ్డ వ్యక్తిని చికిత్స కోసం బెంటియు స్టేట్ హాస్పిటల్‌కు తరలించారు.
యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగులను తీసుకుని జుబాకు బయలుదేరింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తడంతో రన్‌వేకు500 మీటర్ల దూరంలో ఫ్లైట్ కూలింది.