బొగ్గుగనులపై టెర్రరిస్టుల దాడి:20 మంది కార్మికుల కాల్చివేత

బొగ్గుగనులపై టెర్రరిస్టుల దాడి:20 మంది కార్మికుల కాల్చివేత

పాకిస్తాన్లో బొగ్గు గనులపై టెర్రరిస్టు ఎటాక్ జరిగింది. భారీ ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు బెలుచిస్తాన్ లో డుకీ ఏరియాలో ప్రైవేట్ కోల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మైనర్లు చనిపోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (అక్టోబర్ 11,2024) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు రాకెట్లు, గ్రెనేడ్లతో డుకీలోని జునైద్ బొగ్గుగనులపై దాడి చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కార్మికులు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. 

ఇప్పటివరకు20 మంది మృతదేహాలను గుర్తించారు. దుకీ జిల్లా ఆస్పత్రిలో ఆరుగురు కార్మికులు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.