20 శాతం పెరిగిన  ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

న్యూఢిల్లీ: కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థల అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లింపుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.54 శాతం పెరిగి రూ. 5.74 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ ఏడాది  జూన్ 15న చెల్లించాల్సిన ముందస్తు పన్ను తొలి విడత మొత్తం 27.34 శాతం పెరిగి రూ.1.48 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇందులో కార్పొరేషన్ ఆదాయపు పన్ను (సిఐటి) రూ. 1.14 లక్షల కోట్లు  వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) రూ. 34,470 కోట్లు ఉందని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విడుదల చేసిన డేటా వెల్లడించింది.   సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్​టీసీ) ప్రత్యక్ష పన్ను వసూళ్లకు రూ.16,634 కోట్లను అందించింది.  గతేడాది ఇదే సమయంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల విలువ రూ.4,80,458 కోట్లు ఉంది.   2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 11 వరకు రూ. 70,902 కోట్ల రీఫండ్స్​ ఇచ్చారు.