- చంపేసిన సిబ్బంది
నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా అలీసాగర్ లిఫ్ట్ పంపుహౌస్ లో 20 కొండచిలువ పిల్లలు కనిపించాయి. అలీసాగర్ మండలంలోని కోస్లీ గోదావరి ఒడ్డున ఉన్న అలీసాగర్ లిఫ్ట్ పంపు హౌస్ లో గురువారం పెద్ద కొండచిలువ, దాని పిల్లలు కనబడడంతో సిబ్బంది చంపేశారు. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షానికి గోదావరి వరదలో కొట్టుకొని వచ్చి ఉండవచ్చని కార్మికులు భావిస్తున్నారు.