గోవా బీచ్​ వద్ద బోటు మునక.. ఒకరు మృతి .. 20 మంది టూరిస్టులను కాపాడిన రెస్క్యూ టీమ్

గోవా బీచ్​ వద్ద బోటు మునక.. ఒకరు మృతి .. 20 మంది టూరిస్టులను కాపాడిన రెస్క్యూ టీమ్

 

పణజి: గోవాలోని కాలంగుట్ బీచ్​వద్ద టూరిస్టు బోటుకు ప్రమాదం జరిగింది. బోటు కంట్రోల్ తప్పి తీరానికి దాదాపు 60 మీటర్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులోని టూరిస్టులు, బోటు సిబ్బంది నీళ్లలో పడిపోయారు. ఈ ప్రమాదాన్ని ఒడ్డున ఉన్న రెస్క్యూ బృందం సభ్యుడు గమనించి అప్రమత్తమయ్యాడు. 

మిగతా వారిని అలర్ట్ చేస్తూ టూరిస్టులకు సాయంగా సముద్రంలోకి వెళ్లాడు. మొత్తం 18 మంది లైఫ్ సేవర్లు వేగంగా స్పందించి టూరిస్టులను కాపాడారు. ఈ ప్రమాదంలో 54 ఏండ్ల వ్యక్తి ఒకరు చనిపోయారని, మిగతా 20 మందిని సేఫ్ గా ఒడ్డుకు చేర్చామని అధికారులు తెలిపారు.