కంబోడియా ఆర్మీ బేస్ లో పేలుడు.. 20 మంది సైనికులు మృతి

కంబోడియా ఆర్మీ బేస్లో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతిచెందారు.  కంబోడియాకు పశ్చిమాన ఉన్న సైనిక స్థావరంలో మందుగుండు సామాగ్రి పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. శనివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం జరిగిన ఈ పేలుడుతో పలువురు సైనికులు గాయపడ్డారని కంబోడియా ప్రధాని హుమ్ మానెట్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

పేలుడుకు గల కారణాలు ఇంకా తెలిసి రాలేదని అన్నారు. మరణించిన సైనికులకు అత్యవసరంగా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రధాని హున్ మానెట్  కంబోడియన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ ను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో హున్ మానెట్ తెలిపారు.