
సికింద్రాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీకి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ – -కాకినాడ టౌన్-రూట్లో 10 రైళ్లు, హైదరాబాద్– -తిరుపతి – -హైదరాబాద్ రూట్లో మరో 10 రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు ఈ నెల 28 ,29, జనవరి 4,5,11,12,18,19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని, రైళ్లలో ఏసీ1,ఏసీ2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాసులతో పాటు జనరల్సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని తెలిపారు. పండుగకు సొంతూరు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.