కొత్తపల్లి, వెలుగు : నేషనల్ స్కిల్ ఎక్స్‌పోలో పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థులు శుభశ్రీ సాహు, శ్రీయాస్ అగ్రికల్చరల్ ఎకో ఫ్రెండ్లీ అగ్రో మెషీన్‌ను ప్రదర్శించి రూ.20 వేలు బహుమతి సాధించారు. అమెరికాలో నిర్వహించిన వాద్యమంజరి సంగీత పోటీల్లో గంధం హర్షవర్ధన్ మొదటి బహుమతి, హైదరాబాద్ మెలూహ మున్- ఎంయూఎన్ సదస్సులో ఆర్.శైలేందర్ పటేల్, విహాన్ కబ్రా, వి.రిత్విక్ అవార్డులు పొందారు.
విద్యార్థులను స్కూల్ చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనూకర్‌రావు, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, వినోద్‌రావు, హన్మంతరావు, హెచ్ఎం రితేష్ మెహతా, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రాము, పాత్రో, హరిప్రియ, సరిత, టీచర్స్ లలిత్మోహన్సాహు, శివరామకృష్ణ , శ్రేయ బెనర్జీ, జితుమణిశర్మ పాల్గొన్నారు.