హైదరాబాద్లో 20 రకాల నిత్యవసర కల్తీ వస్తువులు సీజ్

హైదరాబాద్లో 20 రకాల నిత్యవసర కల్తీ వస్తువులు సీజ్

ఎన్ని దాడులు చేసినా హైదరాబాద్ లో కల్తీ రాజ్యం ఏలుతోంది.  నిత్యవసర వస్తువులను కల్తీ చేసి మార్కెట్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇవి వాడిన జనం రోగాల బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా  మార్చి 12న కాటేదాన్ పారిశ్రామిక వాడలో  భారీగా కల్తీ నిత్యవసర వస్తువులను పట్టుకున్నారు రాజేంద్రనగర్ ఎస్ ఓటీ బృందం. 

20 రకాల కిరాణా వస్తువులు సీజ్  చేశారు. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి కిరాణా వస్తువులు తయారీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. కల్తీ వస్తుల తయారీ కేంద్రం పై దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‌కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీజ్ చేసినవి

  •     బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్
  •     బ్రూక్ బాండ్ తాజ్‌మహల్‌ టీ పౌడర్
  •     వీల్ సర్ఫ్
  •     ప్యార్ షూట్ కొబ్బరి నూనె
  •     కంఫర్ట్ కండీషనర్
  •     క్లినిక్ ప్లేస్ హెయిర్ షాంపో
  •     కార్న్ పౌడర్ 
  •     పాండ్స్ బాడీ లోషన్ తో పాటు పలు  వస్తువులు గుర్తింపు