- దేశంలోనే మొదటిసారి అమెరికా పద్ధతిలో ‘పల్మనరీ థ్రోంబెక్టమీ’
- 20 ఏండ్ల యువకుడిని కాపాడిన డాక్టర్లు
సికింద్రాబాద్, వెలుగు: లంగ్స్ స్ట్రోక్ కు గురైన 20 ఏండ్ల యువకుడికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్డాక్టర్లు అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. సీనియర్కార్డియాలజిస్ట్ డాక్టర్రఘు, హాస్పిటల్స్డైరెక్టర్ డాక్టర్ పవన్‌గోరుకంటి శుక్రవారం వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన రిషికేశ్గత నెల 28న తీవ్రమైన చాతినొప్పితో సికింద్రాబాద్యశోద హాస్పిటల్‌కు వచ్చాడు. టెస్టులు చేయగా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్స్ట్రోక్మాదిరిగా, ఉపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పల్మనరీ ఎంబోలిజం(లంగ్స్స్ట్రోక్)తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
కాళ్ల సిరల్లో ఏర్పడిన బ్లడ్క్లాట్స్రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్లి, ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటున్నాయని తెలుసుకున్నారు. అలాగే కొనసాగితే గుండెకు వెళ్లే రక్త ప్రసరణ నిలిచి గుండె ఆగిపోవడం, లంగ్స్స్ర్టోక్వంటి సమస్యలు వచ్చి మరణానికి దారి తీస్తాయి. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు సర్జరీ చేసి తొలగించేవారు. దీని వల్ల పేషెంట్ బ్లడ్ఎక్కువగా పోయి రక్తం ఎక్కించాల్సి వచ్చి ప్రాణాపాయ స్థితికి చేరుకునేవారు. కాగా యశోద డాక్టర్లు రిషికేశ్విషయంలో అమెరికాలో అనుసరిస్తున్న పల్మనరీ థ్రోంబెక్టమీ అనే విధానాన్ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ పద్ధతిలో శరీరంపై ఎలాంటి గాటు పెట్టకుండా..గుండె రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌లను తీసేందుకు నిర్వహించే ఆంజియోగ్రామ్ లో వాడే ఇనారి మెడికల్డివైస్ తో ఊపిరితిత్తుల ధమనుల్లో ఏర్పడిన బ్లడ్ క్లాట్స్తొలగించారు. దీంతో పేషెంట్త్వరగా కోలుకుంటాడు. రక్తస్రావం వంటి సమస్యలు ఉండవు. హైపర్టెన్షన్వంటి దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. రిషికేశ్కు యశోద దవాఖన డాక్టర్లు దేశంలోనే ఫస్ట్‌టైం ఇలాంటి చికిత్స చేసి సక్సెస్అయ్యారు.