రేప్ కేసులో ఆటో డ్రైవర్​కు 20 ఏండ్ల జైలు

మెహిదీపట్నం, వెలుగు: మైనర్ బాలిక(16)ను రేప్ చేసిన ఓ ఆటో డ్రైవర్ కు కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. లంగర్ హౌస్ లోని బాపూనగర్ కు చెందిన చాన్ కరణ్​సింగ్ అలియాస్ ఆకాశ్(24) ఆటోడ్రైవర్ గా పనిచేసేవాడు. 2021 డిసెంబర్ 21న స్థానికంగా ఉండే ఓ బాలికను అతడు కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పీఎస్ లో చాన్ కరణ్​సింగ్ పై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. పోలీసులు నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. బుధవారం కేసు విచారణ జరగగా.. చాన్ కరణ్​సింగ్ ను కోర్టు దోషిగా తేల్చింది. దాంతో అతడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.2,500 ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించింది.