పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్​ విధిస్తూ ఫస్ట్ అదనపు జిల్లా,సెషన్స్ కోర్టు జడ్జి కె.ఉమాదేవి గురువారం తీర్పునిచ్చారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం చిమ్మాపూడి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కాంపాటి కార్తీక్(20) గతేడాది మార్చి 5న ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రఘునాథ పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలాలు చేశారు. కేసు రుజువు కావడంతో కార్తీక్ ను దోషిగా నిర్ధారించి జడ్జి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడటంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ భస్వారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. శంకర్, భరోసా లీగల్ అధికారి ఎం.ఉమారాణి, కోర్ట్ కానిస్టేబుల్ జి.రవికిశోర్, కోర్ట్ లైజనింగ్ అధికారులు హెడ్ కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, మోహన్ రావు, హోం గార్డ్ యాకుబ్ ను సీపీ సునీల్ దత్ అభినందించారు.