తాడ్వాయి, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరిగింది. తాజాగా తాడ్వాయి మండలంలోని సంగోజివాడి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శివాజీ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 20 మంది యువకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ఎమ్మెల్యే మదన్మోహన్ పనితీరును చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎండీ గుడుసాబ్, ఎండీ ఇమామ్, ఎండీ గని, యాసిఫ్ తదితరులున్నారు.